Saturday, July 25, 2026
E-PAPER
Homeజాతీయంలీకులకు పాల్పడితే.. మరింత కఠిన చర్యలు

లీకులకు పాల్పడితే.. మరింత కఠిన చర్యలు

- Advertisement -

నూతన బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
ప్రవేశ పరీక్షల అక్రమ పద్ధతుల నివారణ

చట్టంలో కీలక సవరణలకు సిద్ధం
న్యూఢిల్లీ: ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమవుతున్న వేళ వాటిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ప్రధాని మోడీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో పేపర్ లీక్‌లను అరికట్టే దిశగా కీలక అంశాలపై చర్చించారు. ఇప్పటికే అమల్లో ఉన్న 2024 ప్రవేశ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) చట్టంలో సవరణలు చేసి మరింత కఠిన నిబంధనలు తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పేపర్‌ లీకేజీలపై కఠిన శిక్షలకు అవకాశమిచ్చే బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

బళ్లారి-గుంతకల్ మ‌ధ్య మూడో, నాలుగో రైల్వే లైన్లు రూ.1.264 కోట్లతో రైల్వే లైన్ల ప్రాజెక్టు కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం
బళ్లారి-గుంతకల్లు మధ్య మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. శుక్ర‌వారం నాడిక్క‌డ ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివ‌ర్గ‌ సమావేశం జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర రైల్వే, సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. కర్ణాటకలోని బళ్లారి – ఆంధ్రప్రదేశ్‌లోని గుంతకల్లు మధ్య మూడు జిల్లాల ప‌రిధిలో మొత్తం 46 కిలోమీటర్ల మార్గానికి రూ.1,264 కోట్లతో మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్, కర్నా టక రాష్ట్రాలకు ప్రయోజనం కలగనుందన్నారు. ఈ ప్రతిపాదిత మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టు వల్ల సుమారు ఏడు లక్షల జనాభా ఉన్న దాదాపు 99 గ్రామాలకు రవాణా సదుపాయాలు మెరుగుపడనున్నాయని అన్నారు. రూ.3,030 కోట్లతో ర‌సాయ‌న పార్కుల కోసం ‘భవ్య రసాయన’ పథకానికి కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింద‌న్నారు. వేదావతి నదిపై 762 మీటర్ల పొడవైన మెగా రైల్వే వంతెనను నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే 7 ప్రధాన వంతెనలు, 52 చిన్న వంతెనలను కూడా నిర్మించనున్నట్లు చెప్పారు. రైల్వే మల్టీ ట్రాకింగ్‌ ప్రాజెక్టుకు అవసరమైన భూమిలో సుమారు 80 శాతం ఇప్పటికే అందుబాటులో ఉందని, మూడేండ్లలో పనులను పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో 99 గ్రామాలకు రైల్వే అనుసంధానం లభిస్తుందని వెల్లడించారు. రైల్వే సామర్థ్యం పెంపు, రద్దీ తగ్గింపే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -