Sunday, April 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతి మత్స్యకారుడు ఎన్ఏప్ డిపి పోర్టల్లో నమోదు చేసుకోవాలి

ప్రతి మత్స్యకారుడు ఎన్ఏప్ డిపి పోర్టల్లో నమోదు చేసుకోవాలి

- Advertisement -

మత్స్యశాఖ జిల్లా పిల్డ్ ఆపిసర్ బి.రమేష్
నవతెలంగాణ – మల్హర్ రావు

చేపల వృత్తిపై ఆధారపడిన ప్రతి మత్స్యకారుని కుటుంబం నేషనల్ పిషరీప్ డేవలమెంట్ పోర్టల్ (ఎన్ఏప్ డిపి) యాప్లో నమోదు చేసుకోవాలని జిల్లా మత్స్యశాఖ పిల్డ్ ఆఫీసర్ బి.రమేష్ తెలిపారు. ఆదివారం మండల కేంద్రమైన తాడిచెర్లలోని లక్ష్మీ నగర్లో ముదిరాజ్ మహాసభ జిల్లా యువత ఉపాధ్యక్షుడు ముద్రవేణి సురేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం తాటిచెర్లలో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ పోర్టల్లో జిల్లా మత్స్యశాఖ కార్యాలయం జిల్లా అధికారి వై.విజయ్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా ఫీల్డ్ ఆఫీసర్ ఆన్లైన్లో నమోదు కార్యక్రమాన్నీ ప్రారంభించారు. ఆన్లైన్లో నమోదు చేసుకున్న వారు మాత్రమే రాబోయే రాష్ట్ర, కేంద్ర  ప్రభుత్వాల పథకాలకు మత్స్యశాఖ ద్వారా అర్హులుగా గుర్తించబడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల పెద్ద మనుషులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -