జాతీయ బిసి సంఘం జిల్లా ఇంఛార్జి సమ్మయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు
ఆర్టీసీ విషయంలో ప్రభుత్వానిది చారిత్రాత్మక నిర్ణయమని,ఇందుకు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపినట్లుగా జాతీయ బిసి సంఘం భూపాలపల్లి జిల్లా ఇంఛార్జి విజయగిరి సమ్మయ్య ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల విషయంలో పట్టించుకున్న దాఖల్లోలేవని,పోరాటంలో 56 మంది కార్మికులు చనిపోయి, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రకారము కార్మికుల సమస్యలు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేయాలని యూనియన్ కార్మిక సంఘాలు ఎన్నికలు11 పిఆర్సి కార్మికుల హామీలను అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమన్నారు. ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్ పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్ అమలయ్యేదాకా స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
ఆర్టీసీ విషయంలో ప్రభుత్వానిది చారిత్రక నిర్ణయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



