ప్రతి విద్యార్థి ఉన్నంత స్థాయికి ఎదగాలి 

– మాజీ సర్పంచ్ భీముడు 
నవతెలంగాణ నెల్లికుదురు
మండలంలోని నల్లగుట్ట తండాలోని ఎంపీపీ ఎస్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఉన్నంత స్థాయికి ఎదగాలని ఆ గ్రామ మాజీ సర్పంచ్ బానోతు భీముడు యువ నాయకుడు అచ్చు నాయక్ అన్నాడు శుక్రవారం వారి సొంత డబ్బులతో విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల బ్యాగులు వాటర్ బాటిల్ పెన్సిళ్ల  తదితరవి అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా గ్రామపంచాయతీ ఎంపీపీ ఎస్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నా సొంత డబ్బులతో స్కూల్ బ్యాగ్స్ అందించాలని తెలిపారు మరియు అదే పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులకు షూస్ ఖర్చులు అయ్యే డబ్బులను తన సొంత డబ్బులు ఇచ్చి అందించాలని అన్నారు అంతే కాకుండా గ్రామానికి చెందిన యువ నాయకుడు అచ్చు నాయక్న తన సొంత డబ్బులతో విద్యార్థులకు నోట్ బక్స్ పెన్నులను అందించాలని తెలిపారు మరియు ఈ గ్రామపంచాయతీ పంచాయతీ కార్యదర్శి సునీత తన సొంత డబ్బులు హెచ్చించి విద్యార్థులకు మంచినీళ్లు త్రాగడానికి వాటర్ బాటిలను అందించినట్లు తెలిపారు ఇంతటి మంచి కార్యక్రమం నిర్వహించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ఇలాంటి కార్యక్రమం గత కొన్ని ఏండ్ల నుండి నిర్వహిస్తున్నామని అన్నారు విద్య నేర్పించడానికి వచ్చిన ఉపాధ్యాయుడు విద్యార్థులకు అండగా నిలవడం మరియు విధి నిర్వహణలో ఈ గ్రామానికి వచ్చిన పంచాయతీ కార్యదర్శి ఈ గ్రామం అభివృద్ధి ఉండాలని మరియు విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని యువ నాయకుడు గ్రామంలో ఉన్న విద్యార్థులను ఆదుకోవాలని ఉద్దేశంతో ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ఆ గ్రామ ప్రజలు హర్ష వ్యక్తం ప్రకటిస్తున్నట్లు తెలిపారు గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు ఈ సందర్భంగా విద్యార్థులు కష్టపడి గురువులు బోధించిన పాఠాలు విని ఉన్నత స్థాయికిరగడానికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కొంతమంది పాల్గొన్నారు
Spread the love