
– ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అరిఘకూటి శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – నెల్లికుదురు
ప్రతి విద్యార్థి ప్రణాళిక బద్దంగా చదివి ప్రతి సబ్జెక్టులో ప్రతిభ కనబరచి ఉన్నంత స్థాయికి ఎదగాలని మహబూబాబాద్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు వి రాజేందర్ సిహెచ్ మల్లేశం నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అరిగాకుటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మర్సకట్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఆ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి సహకారంతో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై అవగాహన సదస్సును మంగళవారం నిర్వహించారు .ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఆరిగకూటి శ్రీనివాసరెడ్డి, మహబూబాబాద్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు వి.రాజేందర్, సిహెచ్. మల్లేశం లు మాట్లాడుతూ విద్యార్థులు నేటి పోటీ ప్రపంచంలో నైపుణ్యంతో కూడిన విద్యను అభ్యసించాలని అన్నారు. ‘ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్ధేశించుకొని చదవాలి అని అన్నారు. విద్యార్థులు దేనిలో నైపుణ్యం కలిగి ఉన్నారో దాని ఆధారంగా డిగ్రీలో కోర్సులను తీసుకుని ఉన్నత విద్యను అభ్యసించి ఉత్తమ మార్కులు సాధించాలని సూచించారు. ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో ప్రిపరేషన్ చేసి రానున్న పరీక్షలకు సిద్ధం కావాలన్నారు.రానున్న పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచి కళాశాలకు తల్లిదండ్రులకు మంచి గుర్తింపు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ప్రకాష్ బాబు, కవిరాజ్, రఘురాం, శ్రీనివాస్, రామ్మూర్తి, నాగేశ్వరరావు, సుధాకర్, మహేందర్, యాకన్న, సతీష్, సుభాష్, స్పందన తదితరులు పాల్గొన్నారు.