- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారమే ప్రతి ఒక్కరికి హక్కులు లభిస్తున్నాయని మేనూరు గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ అన్నారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రతి ఒక్కరికి హక్కులు లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో గ్రామ ఉపసర్పంచ్ మల్కయ్య, గ్రామ పెద్దలు జుబ్రి సురేష్ నిజాముద్దీన్, పంచాయతీ పాలకవర్గం పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -



