Sunday, June 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి 

పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి 

- Advertisement -

సర్పంచ్ ఏసిరెడ్డి మంజుల
నవతెలంగాణ – ఆలేరు రూరల్

పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని గుండ్లగూడెం గ్రామ సర్పంచ్ ఏసిరెడ్డి మంజుల పిలుపునిచ్చారు.ఆదివారం ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలియో వంటి ప్రమాదకర వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు.ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు  తల్లిదండ్రులు సమీప పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి తప్పనిసరిగా చుక్కలు వేయించాలని సూచించారు.చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది,ఆశా కార్యకర్తలు అంగన్‌వాడీ సిబ్బంది,గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -