గ్రామ సర్పంచ్ బొల్లికొండ చైతన్య నాగరాజు
నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని మునిగలవీడు గ్రామంలో ఉన్న చిన్న పిల్లలకు పోలియో చుక్కలను వేయిస్తున్నట్లు ఆ గ్రామ సర్పంచ్ బొల్లికొండ చైతన్య నాగరాజు, స్థానిక వైద్యాధికారి రమ్య తెలిపారు. ఆదివారం 0 నుండి 5 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలను గుర్తించి చుక్కలు వేయించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పోలియో చుక్కలను చిన్నపిల్లల తల్లిదండ్రులు తప్పకుండా పిల్లలకు వేయించాలని అన్నారు పోలియో రహిత గ్రామంగా మన మునిగల వీడు గ్రామాన్ని తీర్చిదిద్దుకోవాలని తెలిపారు. మన దగ్గరకు స్థానిక వైద్యాధికారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో ఏఎన్ఎంలు ఆశ వర్గాలు నిర్వహించే పోలియో చుక్కలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు మెంబర్స్ నల్లాని పాపారావు గిరగాని ప్రవీణ్ ఏఎన్ఎమ్ రేణుక,ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
మునిగలవీడులో పోలియో చుక్కలు ప్రారంభo
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



