బీఆర్ఎస్ నేతల డిమాండ్..
నవతెలంగాణ – బంజారాహిల్స్
పీవీ నరసింహారావు విగ్రహాన్ని తరలిస్తే మరో ఉద్యమమే బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీ వాణిదేవి, విద్యార్థి నేత గేల్లు శ్రీనివాస్ యాదవ్, గువ్వల బాలరాజ్లు డిమాండ్ చేశారు. ఆదివారం మాజీ ప్రధాని దేశ ఆర్థిక సంస్కర్త అనేక అంకురార్పణలు చేయించి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించారానీ గుర్తు చేస్తూ,ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద ఉన్న పీవీ నరసింహారావు విగ్రహాన్ని తరలించొద్దని డిమాండ్ చేస్తున్నామన్నారు.
కాంగ్రెస్ పార్టీకి సోనియాగాంధీకి పివి నరసింహారావు అంటే ఏ కోసానా గౌరవం లేదని, ఉంటే నగరం నడిబొడ్డున ఉన్న ఈ విగ్రహానికి నివాళులర్పించే సమయం కూడా లేదా.? అంటూ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం పివి, విగ్రహాన్ని ఈ ప్రాంతం నుంచి మార్చాలనుకుంటే? తెలంగాణ ఉద్యమంతో ఏ సంబంధం లేని కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహాన్ని మార్చి, అక్కడ ఏర్పాటు చేయడంతో పాటు ఆ పార్కు పేరును సైతం పివి పేరుగా నామకరణం చేయాలన్నారు. అప్పుడే ఆ కాంగ్రెస్ పార్టీ అసలు రంగు బయటపడుతుందనీ, రాష్ట్ర ముఖ్యమంత్రికి గొప్పలు చెప్పడం మాని తక్షణం దీనిపై దృష్టి కేంద్రీకరించాలని ఉద్భోదించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.



