ప్రతి ఒక్కరు హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవాలి

– వైజిఆర్ కేర్ స్వచ్ఛంద సేవా సంస్థ

నవతెలంగాణ – గోవిందరావుపేట
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవాలని వై జి ఆర్ కేర్ స్వచ్ఛంద సేవా సంస్థ  లింక్ వర్కర్స్ టి కిషన్ బి రాము అన్నారు.గురువారం మండలంలోని పసర గ్రామపంచాయతీ కార్యాలయంలో లోకల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన కిషన్, రాములు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెచ్ఐవి/ ఎయిడ్స్ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. గర్భిణీ స్త్రీ కూడా తప్పనిసరిగా హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవాలని తల్లికి ఒకవేళ హెచ్ఐవి పాజిటివ్ అని తేలితే బిడ్డకు సోకకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలని అన్నారు. మా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి హెచ్ఐవి టెస్ట్ను నిర్వహిస్తామని గర్భిణీ స్త్రీలకు హెచ్ఐవి టెస్ట్ పరీక్షలు నిర్వహించిన అనంతరం తల్లికి పాజిటివ్ వస్తే ఆవ్యాధి బిడ్డకు శోక కుండా ట్రీట్మెంట్ ద్వారా రక్షణ కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ జూనియర్ అసిస్టెంట్ ఎండి అంజుమ్, కారోబార్ సీతారాములు, అంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్లు అటెండర్ తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love