అంబేద్కర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి

– ప్రొఫెసర్‌ ఖాసీం
గట్టు: అంబేద్కర్‌ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ప్రొఫెసర్‌ ఖాసీం కోరారు. గట్టు మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన బాబాసాహెబ్‌ డాక్టర్‌ బీఆర్‌. అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్‌ ఖాసీం హాజరై మాట్లాడుతూ గట్టులో డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ విజయ వంతం కావడానికి గట్టు ప్రజలంతా ఐక్యమత్యంతో సాధించిన ఘనత అని, సహకరించిన అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటామన్నారు. మారుమూల గట్టు మండల కేంద్రంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని నెలకొల్పడం శుభపరిణామం అన్నారు. అలాగే చదువుతూనే పేదరి కాన్ని నిర్మూలించవచ్చు అన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్‌ ఆశయాలు, ఆలోచన విధానం ప్రకారంగా నడుచుకొనేందుకు ప్రతి ఒక్కరూ కషి చేయా లన్నారు. అప్పుడే మహనీయుడికి ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. అంబేద్కర్‌ రచించిన భారత రాజ్యాంగాన్ని కాపాడుకొంటూ,ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని చదువుకోవాలని అన్నారు. గట్టు మండలం అక్షరాస్యతలో ముందంజలో ఉండాలంటే ప్రతి ఒక్క రూ చదువుకోవాలని అన్నారు. చదు వుతోనే పేదల బతుకులు వారి జీవితాలు మారుతా యన్నారు. అంబేద్కర్‌ ఆలోచనలతో ముందుకు నడవాలని.. అప్పుడే అంబేద్కర్‌ ఆలో చనలు ముం దుకు సాగుతాయని అన్నారు. అంబే ద్కర్‌ ఆలోచన విధానంతో ముందుకు వెళ్లాలన్నారు. అలాగే గ్రామాల్లో వెనక పడడానికి కారణం చదువులేక పోవడమే కారణమని ప్రతి ఒక్కరూ చదువుతూనే విజయాన్ని సాధించవచ్చన్నారు. గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని మంచి చదువులు చదివించి వాళ్ళని ఉత్తీర్ణులు చేయాలన్నదే అంబేద్కర్‌ ఆశయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో గట్టు మండల ప్రజలు గోపాల్‌ , మహేష్‌ ,నరసింహ , రాముడు, భాస్కర్‌, తప్పెట్లామోర్స్‌ శీను, యేసు రాజ్‌, మోజెస్‌, సునందు, ప్రకాష్‌ తదితర గ్రామ ప్రజలు ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడు ఏసన్న ఎమ్మార్పీఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Spread the love