సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి

నవ తెలంగాణ – మిరుదొడ్డి 
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలని యూనియన్ బ్యాంక్ మేనేజర్ గేమ్ నాయక్ అన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా గ్రామస్తులకు అవగాహన కల్పించారు. మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో పాటు బ్యాంకులు అందిస్తున్న రుణాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని, ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నారు. బ్యాంకులో తీసుకున్న రుణాలను సకాలంలో లబ్ధిదారులు చెల్లించడం ద్వారా సిబిల్ స్కోర్ పెరగడం జరుగుతుందన్నారు. సిబిల్ స్కోర్ ఆధారంగానే ఏ బ్యాంక్ అయినా వినియోగదారులకు లోన్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. సక్రమంగా రుణాలు చెల్లించే వినియోగదారులకు బ్యాంకులో అండగా నిలవడం జరుగుతుందన్నారు. ప్రధానమంత్రి మోడీ ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు ఎల్ఈడి స్క్రీన్ ద్వారా తెలియజేశారు. గ్రామపంచాయతీ వద్ద మిరుదొడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పుష్ప, ఉప సర్పంచ్ ఉప్పలయ్య, బిజెపి నాయకులు వెంకటేష్, రవి, బాల్ రెడ్డి, కిషన్, పలువురు పాల్గొన్నారు.
Spread the love