యశస్వినిరెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

యశస్వినిరెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి– నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఝాన్సీ రెడ్డి
– కాంగ్రెస్‌ లో చేరిన బీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ-పాలకుర్తి
పాలకుర్తి మండలానికి చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా సీనియర్‌ నాయకులు కొడకండ్ల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఎర్రబెల్లి రాఘవరావు, శాతాపురం గ్రామ సర్పంచ్‌ పసులాది సుశీల వెంక టేష్‌, చెన్నూరు గ్రామ ఉపసర్పంచ్‌ ఆకారపు ఉపేం దర్‌లు టీపీసీసీ అధ్యక్షుడు ఇనుముల రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గురువారం మం డలానికి చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు తీగారం గ్రామ సర్పంచ్‌ పోగు రాజేశ్వరి శ్రీనివాస్‌, వల్మిడి గ్రామ మాజీ సర్పంచ్‌ బీసు లలిత యాదగిరి, లక్ష్మీనారాయణ పురం గ్రామ మాజీ సర్పంచ్‌ గిలకత్తుల సుధాకర్‌ గౌడ్‌, 50 కుటుంబాలతో శాతాపురం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ నాయ కులు, శ్రీనివాస్‌, కిషన్‌ నాయక్‌ తో పాటు 50 కుటు ంబాలు, మంచుప్పుల గ్రామానికి చెందిన బండపల్లి వెంకన్న గౌడ్‌ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు, ఈర వెన్ను గ్రామానికి చెందిన ఎల్లస్వామి ఆధ్వర్యంలో 20 కుటుంబాలు, ముత్తారం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు 50 మంది పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈసందర్భంగా పార్టీలో చేరిన వారి అందరికీ ఝాన్సీ రెడ్డి పార్టీ కండు వాలు కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడారు. ఎన్నికల్లో యశ స్విని గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి అం డగా ఉంటా నని తెలిపారు. అనంతరం పార్టీలో చేరిన రాఘవ రావు, శ్రీనివాస్‌, సుధాకర్‌, వెంకటేష్‌ లు మాట్లా డుతూ ఈఎన్నికల్లో యశస్విని రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, పాలకుర్తి, దేవరు ప్పుల మండలాల పార్టీ అధ్యక్షులు గెరగాని కుమార స్వామి, పెద్ది కష్ణమూర్తి గౌడ్‌, జిల్లా ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షుడు జలగం కుమార్‌, బొమ్మగాని భాస్కర్‌ గౌడ్‌, మహేందర్‌రెడ్డి, బిర్రు సోమేశ్వర్‌, కె.సోమన్న, పెనగొండ రమేష్‌, గారపాక ఎల్లయ్య, సుధాకర్‌, సలేంద్ర వెంకన్న యాదవ్‌, పసులాది యాకస్వామి తదితరులు ఉన్నారు.

Spread the love