ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోండి

– వనపర్తి అడిషనల్‌ ఎస్పీ రాందాస్‌ తేజావత్‌
నవతెలంగాణ – ఆత్మకూరు
పార్లమెంటు ఎన్నికల దశ్య పరిశీలన సందర్భంగా ఆదివారం సాయంత్రం ఆత్మకూరు పట్టణంలోని పోలీస్‌ స్టేషన్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఆత్మకూరు మండలంలో 35 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వాటిలో రెండు సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. మండలంలో ఇదివరకు 38 గురిని బైండోవర్‌ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 60మందిని భద్రత సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.ఐదు మొబైల్‌ టీంలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇట్టి బందోబస్తుకు ఒక ఎస్‌ఐ, సీఐ పర్యవేక్షణ చేస్తారని ఆయన తెలిపారు. ఇటి కార్యక్రమంలో ఎస్సై నరేందర్‌ పోలీస్‌ సిబ్బంది తదితరులు పేర్కొన్నారు.

Spread the love