– ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గుగులోతు రమేష్
నవతెలంగాణ-ములుగు
ప్రవేట్ పాఠశాలలో ముందస్తు ఫీజుల దోపిడీ అరికట్టాలని,ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు నియంత్రన చట్టం అమలు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపా ధ్యక్షులు గుగులోతు రమేష్ విద్యాశాఖ అధికారులను కోరారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) ములుగు మండల కమిటీ సమావేశం జిల్లా కార్యా లయంలో శుక్రవారం నిర్వహించారు.ఈ సందర్భం గా ములుగు జిల్లా ఉపాధ్యక్షుడు గుగులోతు రమేష్ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలో ఫీజుల నియంత్రన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజుల నియంత్రణ చట్టం లేకపోవడం వలన ప్రైవేటు యాజమాన్యాలు వారి ఇష్టాను సారంగా ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి కనిపి స్తుందన్నారు. జిల్లా వ్యాప్తంగా బ్రాంచీల పేరుతో అనుమతి లేకున్నా కానీ నూతన పాఠశాలలు ప్రారంభిస్తున్నారని అన్నారు. మండల,జిల్లా అధికారులు స్పందించి బ్రాంచీల పేరుతో ప్రారంభి స్తున్న పాఠశాలల పై చర్య తీసుకొని మూసివేయా లని అన్నారు. అనుమతి లేకున్నా కానీ ముందస్తు అడ్మిషన్లు చేస్తూ, హౌడింగ్ పెడుతున్న కానీ కనీసం జిల్లా అధికారులు స్పందించకపోవడం చాలా బాధాకరమని అన్నారు. హాస్టల్ బుకింగ్ పేరిట విద్యార్థుల దగ్గర్నుంచి ముందుగానే డబ్బులు వసూ లు చేస్తున్నారని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రు లకు ముందుగానే యూనిఫామ్స్, బుక్స్ తీసు కోవాలని మెసేజ్లు చేస్తూ తల్లిదండ్రులను వేధిస్తు న్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించ కుంటే పెద్ద ఎత్తున్న ఆందోళనలు చేస్తామని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు, సాదు రాకేష్, సోషల్ మీడియా ఇంచార్జీ సాయి చరణ్, తదితరులు పాల్గొన్నారు.