నవతెలంగాణ-ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని జాతీయ రహదారి కరీంనగర్ వెళ్లే దారిలో కొట్టారుమూరులో గల అన్నపూర్ణ సీడ్స్ పేస్టి సైడ్ షాపు ముందు సోమవారం ఉద్రిక్తత నెలకొంది. వేల్పూర్ మండలంలోని లక్కోరా గ్రామానికి చెందిన వినయ్ మృతి చెందగా వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈనెల 12వ తేదీన ఈయన దుకాణం నుండి గడ్డి మందు తీసుకొని దానిని తాగినట్లు తెలిసింది. అప్పటినుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో వారు ప్రభుత్వం ఈ గడ్డి మందు గుర్తింపును రద్దు చేయగా..ఎలాంటి రుజువు ,ఆధారపత్రాలు లేకుండా ఎలా అమ్ముతున్నారని దుకాణ నిర్వాకుడిని కుటుంబ సభ్యులు నిలదీశారు. వాగ్వివాదం చోటు చేసుకోగా స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్ పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన చేస్తున్న మృతుడి కుటుంబ సభ్యులను ఆందోళన విరమించాలని కోరినారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం తో ఫిర్యాదు ప్రకారంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వగా ఆందోళన విరమింప చేశారు.
మృతదేహంతో కుటుంబ సభ్యుల ఆందోళన
- Advertisement -
- Advertisement -



