తోటపల్లిలో రాజీవ్ రహదారిపై ఆందోళన
మిల్లు వద్ద వాహనాల బారులు
నవతెలంగాణ-బెజ్జంకి
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించినా.. దాన్ని మిల్లుల్లో దిగుమతి చేసుకోవడంలో ఆలస్యం చేయడంపై రైతులు ఆవేదన చెందుతున్నారు. దీనిపై సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లిలో శనివారం ఆందోళనకు దిగారు. వరి ధాన్యం బస్తాలను అన్‌లోడ్ చేయడానికి మూడ్రోజులుగా రైతులు వాహనాలతో గోదాము వద్ద నిరీక్షిస్తున్నారు. బెజ్జంకి మండల కేంద్రంలో ఏఎంసీ గోదాం నిండిపోవడంతో మరో మిల్లుకు తరలించాలని రైతులకు అధికారులు సూచించారు. దాంతో ఆయా గ్రామాల నుంచి ధాన్యం బస్తాల వాహనాలతో అధికారులు సూచించిన మిల్లుకు వెళ్తే.. తమకు ఎలాంటి ఆదేశాల్లేవని యాజమాన్యం చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెజ్జంకి మండల పరిధిలోని తోటపల్లి గ్రామ శివారులోని శ్రీలక్ష్మీ రైస్ మిల్లు ఎదుట రాజీవ్ రహదారిపై బైటాయించారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ తోట తిరుపతి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి అందోళన విరమింపజేశారు. ఎట్టకేలకు అధికారులు ధాన్యం దిగుమతికి శ్రీలక్ష్మీ రైస్‌మిల్లు గోదాం కేటాయించారు. ధాన్యం దిగుమతిని డిప్యూటీ తహసీల్దార్ అయేషా రఫత్, ఏపీఎం పర్శరాములు, సీసీలు సారయ్య, తిరుపతి పర్యవేక్షించారు.
ధాన్యం దిగుమతుల ఆలస్యంపై అన్నదాత ఆగ్రహం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



