రైతులు అధైర్య పడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది

– తడిసిన దాన్యాన్ని పరిశీలించిన ప్యాక్స్ బృందం
నవతెలంగాణ- మల్హర్ రావు
ప్రకృతి విపత్తుతో కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాలతో వరిధాన్యం తడిసి తీవ్రంగా నష్టపోయిన రైతులు అధైర్య పడవద్దని,ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని మండల కేంద్రమైన తాడిచెర్ల పిఏసిఎస్ ప్యాక్స్ బృందం భరోసా ఇచ్చారు. రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆదేశాల మేరకు శనివారం పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పిఏసిఎస్ వైస్ చైర్మన్ మల్కా ప్రకాష్ రావు, డైరెక్టర్లు ఇప్ప మొoడయ్య,వొన్న తిరుపతి రావు లు సందర్షించారు.ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు ప్రభుత్వం తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తోందని, రైతులు ఆందోళన చెందకుండా ధాన్యాన్ని అరబెట్టాలని సూచించారు.రైతులు పండించిన చివరిగింజ వరకు కొనుగోలు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని సొసైటీ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కిషన్ నాయక్,రాగం ఐలయ్య, పల్లెర్ల మధు పాల్గొన్నారు.
Spread the love