Tuesday, June 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆదర్శ గ్రామంలో రోడ్డెక్కిన అన్నదాతలు 

ఆదర్శ గ్రామంలో రోడ్డెక్కిన అన్నదాతలు 

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్
యూరియా యాప్ వల్ల రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండలంలోని ఆదర్శ గ్రామమైన అంకాపూర్ గ్రామ రైతులు మంగళవారం రోడ్డెక్కారు. యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ రోడ్డుపై ధర్నా నిర్వహించినారు. దీంతో కిలోమీటర్ మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయినాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్’ (యూరియా యాప్) ద్వారా ఎరువులు పొందే విధానంలో సర్వర్ డౌన్ సమస్యలు, సాంకేతిక లోపాలు, ఓటీపీ రాకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. యాప్ ఓపెన్ చేయగానే చాలా సందర్భాల్లో ‘నో స్టాక్’ (స్టాక్ లేదు) అని చూపించడం లేదా సర్వర్ లోపాల వల్ల ఓటీపీలు సకాలంలో రాకపోవడంతో  తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని చాలా మంది రైతులకు స్మార్ట్‌ఫోన్ల వాడకం, ఆన్‌లైన్ బుకింగ్ విధానాలపై అవగాహన లేకపోవడంతో వారు వ్యవసాయ అధికారులపై (AEOs) లేదా ఇతరులపై ఆధారపడాల్సి వస్తుందని చెబుతున్నారు.

సమయం వృధా: యూరియా కోసం గంటల తరబడి ఫోన్ల ముందు, సొసైటీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసినారు. మారిన ఆన్‌లైన్ యూరియా యాప్ విధానాన్ని వెంటనే పూర్తిగా రద్దు చేయాలని, గతంలో మాదిరిగానే విలేజ్ సొసైటీల ద్వారా నేరుగా రైతులకు ఎలాంటి ఆన్‌లైన్ నిబంధనలు లేకుండా యూరియా బస్తాలను పంపిణీ చేయాలని, ప్రస్తుత సాగు సీజన్‌కు అనుగుణంగా సొసైటీల్లో తగినంత యూరియా నిల్వలను అందుబాటులో ఉంచాలని రైతన్నలు డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -