Saturday, May 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో

దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో

- Advertisement -

నవతెలంగాణ – మోపాల్ 
రోజురోజుకు ఎండలు తీవ్రమవుతున్నాయి. రైతులు ఆరబోసుకోని కుప్పలు చేసిన ధాన్యం రాశులు ఎండలకు ఎండి బరువు తగ్గుతుంది. కుప్పలు చేసిన ధాన్యం 15 నుంచి 20 రోజులు అవుతున్న ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. దొడ్డు రకం ధాన్యాన్ని రైస్ మిల్లర్లు తీసుకోవడం లేదు. ప్రభుత్వం కొనుగోలులొ చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ మోపాల్ మండల కేంద్రంలో శనివారం రోజున దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాస్తారోకో చేశారు. అనంతరం రోడ్డు మీదనే మానవాహారం చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి తమ నిరసనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా అఖిలభారత రైతు కూలీ సంఘం ఎ ఐ కే ఎమ్మెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేల్పూర్ భూమయ్య, మోపాల్ గ్రామ సర్పంచ్ ధ్యాప రవి,అగ్గు చిన్నయ్యలు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల ధాన్యాన్ని కొనడంలో విఫలమైందని, పంట వేసినప్పుడు యూరియా కొరతతో రైతుల్ని ఆగం చేసిన ఈ సర్కార్ చేతికి వచ్చిన పంటను కొనడంలో గోస పెడుతోందని మండిపడ్డారు. 46 డిగ్రీల ఎండలో ఎన్ని రోజులు రైతులు తమ కుప్పల దగ్గర కాపాల ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యాపుల ద్వారా మేము కొనలేక పోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం అంటే, కాంగ్రెస్ సర్కార్కు చేతకాక పంటలు కొంటలేదని కేంద్ర ప్రభుత్వం అంటుందని ఒకరి మీద ఒకరు మీ విమర్శలకే పరిమితం అవుతున్నారని వారన్నారు.

కొనుగోలు కేంద్రాల వద్ద నీడ సౌకర్యం, టెంటు వేయడం గానీ నీళ్ల సౌకర్యం పెట్టలేకపోతున్నారని, రైతులు తీవ్ర ఎండవేడికి అస్వస్థకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలలో ఫీల్డ్ లో రైతు ముందు తుకం వేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లుకు తరలించి 24 గంటలలో రైతు ఖాతాలో డబ్బులు జమ చేయాలని వారు డిమాండ్ చేశారు. 2 నుంచి 5 కిలోల తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్నారని,  రైస్ మిల్లుయాజమాన్యం, కొనుగోలు సంస్థల అధికారులు మిలకత్ అయి రైతును నిలువు దోపిడీ చేస్తున్నారని వారన్నారు. హమాలీలు, గన్ని సంచులు, లారీల కొరతల వల్ల తదితర కారణాలతో కొనుగోలు తీవ్ర జాప్యం జరుగుతుందని వీటన్నింటికీ చక్క పెట్టకుండా ప్రభుత్వం ఏం చేస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగానే కొనుగోలులో జాప్యం కొనసాగినట్లయితే త్వరలోనే పెద్ద ఎత్తున రైతుల మంత కలిసి చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపడతామని వారు తెలిపారు. 

అక్కడికి మోపాల్ ఎస్సై సుష్మిత వచ్చి ఆందోళన కార్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కచ్చితంగా మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆమె వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లొ గుడ్డోల్ల గంగాధర్, కెంపు నరేష్,పోతన్న, యెల్లోళ్ల నారాయణ,బంటు గంగాధర్, జక్కునడపన్న,,మమ్మాయి మల్లవ్వ, కెంపు నర్సవ్వ, బి గంగ సాయిలు,దమ్మడి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -