Saturday, May 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మే డే స్ఫూర్తితో ఐక్య పోరాటాలు చేద్దాం

మే డే స్ఫూర్తితో ఐక్య పోరాటాలు చేద్దాం

- Advertisement -

సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ
నవతెలంగాణ – భువనగిరి

కార్మికుల హక్కులను కాలరాస్తున్న బిజెపి విధాలను ఎండగాడదామని నాటి అమరుల స్ఫూర్తితో తో మేడే సందర్భంగా కార్మికుల హక్కుల రక్షణకై కలిసి పోరాడుదామని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ  విజ్ఞప్తి చేశారు.  శనివారం రోజు మే డే సందర్భంగా భువనగిరి పట్టణంలో 11వ వార్డు బొమ్మాయిపల్లి గ్రామంలో జండా శాఖ కార్యదర్శి బండి రవి ఆవిష్కరించారు. కార్యక్రమానికి మాయ కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇండస్ట్రియల్ లో ఎల్లమ్మ గుడి వద్ద సిఐటియు జెండా ఆవిష్కరించారు. అనంతరం మాయ కృష్ణ మాట్లాడుతూ.. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి కార్మిక వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చి కార్మికుల హక్కులను అవకాశాలు లేకుండా చేస్తున్నారని విమర్శించారు. పని గంటలు పెరగడంతో కార్మికులపై అనేక రకాలుగా పని భారం పడి వారు నిరుద్యోగులుగా మారుతున్నారు. నిరుద్యోగం మరింత త్రీవమవుతున్నాయని అన్నారు. బిజెపి రెండవ సారి కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మరింత కార్మికులపై భారాలు వేస్తూ పని గంటలు పెంచుతూ కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలు చేస్తూ కార్మికుల నడ్డి విరుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు బందెల ఎల్లయ్య వనం రాజు వోల్దాస్ అంజయ్య, పర్వత్ బాలకృష్ణ, దండు గిరి, బండి రవి, గుండెబోయిన కృష్ణ, చింతల శివ, కొత్త లక్ష్మయ్య పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -