ముస్లిం సోదరుల ఉపవాస దీక్షలు ఫలించాలి

– కాంగ్రెస్ ప్రభుత్వంలోని అన్ని మతాలకు గౌరవం
– అరాఫత్ మసీదులో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి
నవతెలంగాణ – సూర్యాపేట
ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే రంజాన్ పండుగ సందర్భంగా చేసే కటోర ఉపవాస దీక్షలు ఫలించాలని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించకొని  మంగళవారం స్థానిక అరాఫత్ మసీదులో ముస్లిం సోదరులకు ఆయన ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసి మాట్లాడారు. అల్లా ఆశీర్వాదంతో ప్రజలంతా సుఖసంతోషాలతో తులతూగాలని ఆకాంక్షించారు.  వచ్చే ఏడాది అందరిని కలిపి ఒకే చోట ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తరఫున కృషి చేస్తానన్నారు. భారతదేశ సెక్యులర్ దేశమని అన్ని కులాలకు మతాలకు సమాన హక్కులు ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని మతాలకు సమాన గౌరవం ఇచ్చిందని కొన్ని పార్టీలు విభజన చేసి మనలను విచ్చిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆ ప్రయత్నాలను తిప్పి కొట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉర్దూ పాఠశాలలు,  నాలుగు శాతం రిజర్వేషన్ తో పాటు ముస్లింలను ఆదుకునేందుకు అనేక రకాల చర్యలను చేపట్టిందని గుర్తు చేశారు. జిల్లా కేంద్రంలో షాది ఖానా నిర్మాణంతో పాటు హజ్ భవనాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు షఫీ ఉల్లా, వెంకన్న, సీనియర్ నాయకులు గట్టు శ్రీనివాస్, ముదిరెడ్డి రమణ రెడ్డి, పెద్దిరెడ్డి రాజా,  వల్డాస్ దేవేందర్, జ్యోతి కరుణాకర్, దొంతి రెడ్డి సైదిరెడ్డి,గోదాల రంగారెడ్డి,పిల్లల రమేశ్ నాయుడు,స్వామి నాయుడు, సాజిద్,ఇమ్రాన్, ముస్లిం మత పెద్దలు,  మసీదు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love