63 నంబరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

నవతెలంగాణ -ఆర్మూర్  : మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ శివారులోని కరీంనగర్ వెళ్లే జాతీయ రహదారి 63పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ఎదురెదురుగా రెండు లారీలు ఢీకొనగా ఒక లారీ దగ్ధమైంది స్టేషన్ హౌస్ ఆఫీసర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం గుజరాత్ నుండి విశాఖపట్నం వైపు గ్రైనేట్ లోడుతో వెళ్తున్న లారీ,, కరీంనగర్ నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న మరో లారీని ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు గ్రైనేట్ లోడుతో వెళ్తున్న లారీ ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది ఇందులో ఉన్న డ్రైవర్ క్లీనర్ లను స్థానికులు బయటకు తీసుకు రాగా మీరు తీవ్రంగా గాయపడ్డారు . కరీంనగర్ నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ కి కాలు విరిగి తీవ్ర గాయాలైనట్టు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్సై అశోక్ కుమార్ అగ్ని బాపక సిబ్బంది హుటా హుటిన చేరుకొని లారీ మంటలను ఆర్పి వేశారు కాగా జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటు చేసుకోవడంతో వాహనదారులకు ఇలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు చేపట్టినట్టు ఎస్ హెచ్ ఓ తెలిపారు.
Spread the love