- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం వైజాగ్ నుంచి మహారాష్ట్ర వెళ్తున్న బొగ్గు లారీ మర్రిపేడ నుంచి ఖమ్మం వైపు వెళుతున్న మరో లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. మేకల తండా స్టేజి సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో రెండు లారీలు నుజ్జునుజ్జు కాగా, ప్రమాద దాటికి బొగ్గులోడ్ లారీలో మంటలు చెలరేగాయి. దీంతో లారీ డ్రైవర్ జేమ్స్ తో పాటు మరో వ్యక్తి సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
- Advertisement -



