Thursday, August 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫీజు రియంబర్స్మెంట్ బకాయిని వెంటనే విడుదల చేయాలి 

ఫీజు రియంబర్స్మెంట్ బకాయిని వెంటనే విడుదల చేయాలి 

- Advertisement -

యువ మోర్చా నాయకుడు శివ సాయి 
నవతెలంగాణ-నెల్లికుదురు 

కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిని వెంటనే విడుదల చేయాలని బిజెపి యువ మోర్చా మండల నాయకుడు శివ సాయి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్టు తెలిపారు. మండల కేంద్రంలో విద్యార్థుల సంతకాల సేకరణ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 15000 కోట్ల రూపాయల బకాయి పెట్టి కాలయాపన చేయడం సరైనది కాదని అన్నారు. 50 లక్షల మంది విద్యార్థుల పరిస్థితి ఇబ్బందిగా మారిందని వెంటనే బకాయి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని అన్నారు లేని ఎడల  విద్యార్థులతో కలిసి భారీ ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో యువర్ మోర్చా శివ సాయి శ్రీకాంత్ అదేవిధంగా మండల బిజెపి నాయకులు బాదావ సురేష్ తోట రమేష్ సురేష్ జబ్బర్ లాల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -