నవతెలంగాణ – ఆలేరు రూరల్
బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం ఆలేరు మండలంలోని టంగుటూరు గ్రామంలో హ్యాండ్లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, ఆలేరు చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన దాసి శంకర్‌ను ఘనంగా సన్మానించారు.అలాగే డైరెక్టర్లుగా ఎన్నికైన ఎలగందుల ఉమా ఋషి,అందే రాములు,ఎలగందుల పద్మలను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు పూజారి కుమారస్వామి మాట్లాడుతూ నేత కార్మికుల అభివృద్ధికి హ్యాండ్లూమ్ సొసైటీ కీలక పాత్ర పోషిస్తుందని, నూతన పాలకవర్గం నేతల సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.ప్రజల విశ్వాసానికి అనుగుణంగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కామిటికారి కృష్ణ,పిన్నింటి భాస్కర్ రెడ్డి,వడ్డేపల్లి కిషన్, ఆవునూరి సాయినాథ్,ముదిగొండ సత్తయ్య, చింతకింది నాగరాజు, కట్ట అమరేందర్ రెడ్డి, జన్నే మైపాల్, మండల నాయకులు శేషత్త్వం, అమరేందర్,ఏలగల వెంకటేష్, బైరి మహేందర్ గౌడ్, సొసైటీ మాజీ ప్రధాన కార్యదర్శి ఎలగందుల రామ ఋషి,జాలపు మాధవ్ రెడ్డి,లక్ష్మీనారాయణ,బద్రి తదితరులు పాల్గొన్నారు.
హ్యాండ్లూమ్ సొసైటీ నూతన చైర్మన్, డైరెక్టర్లకు సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



