ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య 

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
మండలంలోని కలిగోట గ్రామానికి చెందిన మార్గం గౌతమి భర్త చిన్న బాలరాజు,(25)సంలు అనే మహిళా రెండు మూడు రోజులుగా కడుపునొప్పితో బాధపడుతూ ఉంది. గురువారం ఉదయం 6 గంటలకు భర్త బయటకు వెళ్లిన సమయంలో కడుపునొప్పి భరించలేక ఇంట్లో ఉరివేసుకొని చనిపోయిందని జక్రాన్ పల్లి ఎస్ఐ తిరుపతి తెలిపారు. భర్త నెల రోజుల కిందట దుబాయ్ నుండి తిరిగి వచ్చినాడు. వారికి ఒక ఒక కొడుకు. వయసు మూడు సంవత్సరాలు. సంఘటన స్థలానికి డిచ్పల్లి సీఐ జక్రాంపల్లి ఎస్సై, జక్రాన్పల్లి తహసీల్దార్ సందర్శించి పంచనామా నిర్వహించారు. మృతురాలి తల్లి ఇచ్చిన దరఖాస్తు పై కేసు నమోదు చేయడమైనదని ఎస్సై తిరుపతి తెలిపారు.
Spread the love