రూ.4000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

నవతెలంగాణ – జక్రాన్ పల్లి

రూ.4000 లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. ఈ సంఘటన సోమవారం మండలంలోని తొర్లికొండ గ్రామంలో జరిగింది. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన నిఖిల్ అనే యువకుడు ఇటీవల తొర్లికొండ గ్రామంలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. దానిని రిజిస్ట్రేషన్ కోసం ఎన్ఓసి నిమిత్తం గ్రామపంచాయతీ కార్యదర్శి తోపారం మనోహర్ ను సంప్రదించారు . కానీ పంచాయతీ కార్యదర్శి 15వేల రూపాయలు లంచం ఇస్తేనే ధ్రువీకరణ పత్రం ఇస్తానని చెప్పడంతో, బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో మనోహర్ కు రూ.4,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా నిజాంబాద్ ఏసిబి డి.ఎస్.పి ఇన్స్ పెక్టర్లు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మనోహర్ ను అరెస్టు చేసి, కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని అధికారులు తెలిపారు.
Spread the love