ఆడపిల్లలు సమాజానికి మణిహారం లాంటివాళ్లు

ఆడపిల్లలకు రక్షణ కల్పిద్దాం : మాజీ ఎంపీపీ హరిత
నవ తెలంగాణ – జక్రాన్ పల్లి
ఆడపిల్లలు సమాజానికి మణిహారం లాంటి వాళ్లు ఆడపిల్లలకు రక్షణ కల్పిద్దామని, మాజీ ఎంపీపీ హరిత శనివారం అన్నారు. మండలంలోని  కొలిప్యాక్ గ్రామంలో మహిళా శిశు సంక్షేమ ఆధ్వర్యంలో నేషనల్ గర్ల్స్ చైల్డ్ ప్రోగ్రాం బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎంపీపీ డికొండ హరిత పాల్గొని ఆడపిల్లలు సమాజానికి మణిహారం లాంటి వాళ్లు ఆడపిల్లలకు రక్షణ కల్పిద్దాం వారి బంగారు భవితకు పునాది వెయ్యాలని అన్నారు. వారికి స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలి తెలియజేశారు. తరువాత మహిళలతో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో అంగన్వాడి మండల సూపర్వైజర్ రాణి  అంగన్వాడీ టీచర్స్ నీలా,  వనజ , ఆశా వర్కర్స్ మహిళా సంఘం అధ్యక్షురాలు సునీత, లత మరియు మహిళలు అంగన్వాడి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love