పోలీసులు అనుకుంటే పుట్టలోని పామును బయటకు తీస్తారు  

– మనుషుల పట్ల మానవత్వం కలిగి ఉండాలి

– చట్టాల పైన అవగాహన సదస్సు
నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
పోలీసులు అనుకుంటే పుట్టలోని పామును బయటకు తీస్తారని, ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి నర్సింహ సుల్తానా శనివారం అన్నారు. జక్రాన్ పల్లి మండల కేంద్రంలోని  హైస్కూల్లో శనివారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ నిజాంబాద్, పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా న్యాయ చైతన్య సదస్సును నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవ అధికార సంఘం చైర్పర్సన్ నసీమా సుల్తానా హాజరై మాట్లాడుతూ..  ప్రజలకు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి నజీమా సుల్తానా మాట్లాడుతూ తన గత 15 సంవత్సరాల అనుభవాన్ని ప్రజలకు తెలియజేస్తూ మా తాతల కాలం నుంచి అందరూ పోలీస్ శాఖలో పని చేశారని, మా తాత ఒక సందర్భంలో మాట్లాడుతూ పోలీసు అనుకుంటే పుట్టలో పామును బయటకు తీస్తాడని తెలియజేశారు.  చట్టాన్ని ఎవరు కూడా చేతిలోకి  తీసుకోకూడదని అన్నారు . చట్టం దృష్టిలో ఆడ ,మగా ఇద్దరూ సమానమే. పట్టా భూములపై  ఇతర సమస్యల పైన సమస్య ఉంటే దానికి పోలీస్ డిపార్ట్మెంట్, జ్యుడీషియల్ కోర్టు, రెవెన్యూ  డిపార్ట్మెంట్ కు  సంప్రదించాలని ప్రజలకు తెలియజేశారు. ముఖ్యంగా గ్రామాలలో  గ్రామ బహిష్కరణ అనేది ఉండకూడదని. ఇంకోటి  అంట రాణి తనము ఉండకూడదు.అని తెలియజేశారు. ప్రజల్లో కొత్త చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని. రాజ్యాంగం  పౌరా హక్కులపై   సేబర్ యాక్ట్,సైబర్ నేరాలపై బ్యాంకుల ద్వారా ఆన్లైన్లో ట్రాన్స్లేషన్ జరిపేటప్పుడు మోసపోవద్దని  ఆన్లైన్లో ఎవరికి కూడా ఓటీపీ చెప్పకూడదని .  చైన్ స్నాచింగ్ కేసు లు,డ్రగ్స్ & ఫోక్స చట్టంపైన అవగాహనా సదస్సు నిర్వహించరు.LAW  OF THE LAND, LAW IS EVERY ONE EQUAL అని తెలిపారు.   కార్యక్రమంలో  ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి నాజీమా సుల్తానా, డీసీపీ జయరాం, ఏసీపీ విజయ సారథి, ఆర్డీవో వినోద్ కుమార్, ఆర్మూర్ బార్ ప్రెసిడెంట్ చిన్న రెడ్డి, ఎంపీపీ కుంచాల విమల రాజు, తాసిల్దార్ ఖలీమ్, ఎస్సై తిరుపతి, సిఐ సైదులు, మండల ఎంపీడీవో  బ్రాహ్మానందం,మండల కో ఆప్షన్ సభ్యులు బుల్లెట్ అక్బర్ ఖాన్, ఎంపీవో యూసఫ్ ఖాన్, ఎంఈఓ శ్రీనివాస్,సర్పంచ్ జక్కం చంద్రకళ బాలకిషన్, గొర్త రాజేందర్, ఎంపీటీసీ లు, రూపాల గంగారెడ్డి, మరియా సతీష్, ప్రజలు తదితరులు పాల్గోన్నారు.
Spread the love