నవతెలంగాణ-హైదరాబాద్
మే 2021లో, ఒక జంట, భార్య వయసు 32 సంవత్సరాలు కాగా భర్త వయసు 34 సంవత్సరాలు. మగ వంధ్యత్వం కారణంగా అనేకసార్లు IVF చికిత్స ప్రయత్నించినప్పటికీ విజయం సాదించలేకపోవటంతో ఫెర్టీ9కి వచ్చారు. పురుషునికి అధిక DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ 48% ఉండటం వల్ల డోనార్ వీర్య కణాలు తీసుకోవాల్సిందిగా చెప్పటం జరిగింది. అయినప్పటికీ ఆ జంట తమ సొంత వీర్య కణాలతోనే ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు. ఫెర్టీ9 మైక్రోఫ్లూయిడిక్స్ IVF-ICSI. అనే అత్యాధునిక పద్దతి ద్వారా వీర్యం లోని హానికరమైన పదార్ధాలను తొలగించి ఆరోగ్యకరమైన స్పెర్మ్ ని ఉపయోగించటం జరిగింది. జన్యు పరీక్ష ( PGT-A) ద్వారా సాధారణమైన బ్లాస్టోసిస్ట్లను గుర్తించి వాటిని మహిళ యొక్క సహజ చక్రాన్ని ( నేచురల్ సైకిల్) అనుసరించి ఎండోమెట్రియం సిద్దమైన తరువాత బదిలీ చేయబడ్డాయి. రెండు వారాల తరువాత, ఈ జంటకు గర్భధారణ పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. అల్ట్రాసౌండ్ స్కాన్ లో కూడా హృదయ స్పందనతో కూడిన ఆరోగ్యకరమైన గర్భం నిర్ధారించ బడినది . సెప్టెంబర్ 20, 2022న, వారు తమ జీవితంలోకి ఒక అందమైన ఆడ శిశువును స్వాగతించారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ, నమ్మకం కోల్పోకుండా ప్రయత్నిస్తే విజయం సొంతం అవుతుందనే దానికి వుదాహరణగా నిలిచింది. అనేక జంటల కల లు నెరవేర్చటానికి Ferty9 టీం ఎంతగానో కృషి చేస్తుంది.