ఆర్థిక సాయం అందజేత..

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట ఆదివారం, ఎండి గోరే కుమార్తె పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించి 5000 ఆర్థిక సహాయం మాజీ వార్డు మెంబర్ కళ్లెం విజయ జహంగీర్ గౌడ్ అందజేశారు. మాజీ ఒకటో వార్డు మెంబర్ ఎండి ఉస్మాన్ ఒకటో వార్డు లో ప్రతి ఆడపిల్ల పెళ్ళికి తన వంతు సాయంగా ఐదు వేల రూపాయలు ఇస్తానని ఇచ్చిన మాట తప్పకుండా ఆదివారం జరిగిన ఎండి గోరే కుమార్తె పెళ్లికి హాజరై 5000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాసాయిపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాండవుల సత్య ప్రకాష్, మండల కో ఆప్షన్ నెంబర్ ఎండి యాకూబ్, మండల మైనార్టీ అధ్యక్షులు ఎండి యాకూబ్ అలీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎస్ కే ఖరీం సాబ్ ఎస్.కె ఇమామ్ పాషా ఎండి కబీర్, ఎండి హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love