Sunday, June 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చిన్ననాటి మిత్రుడి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం 

చిన్ననాటి మిత్రుడి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం 

- Advertisement -

నవతెలంగాణ-నవాబు పేట
తన చిన్ననాటి స్నేహితుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం తమకు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని 1991-92 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్‌కు చెందిన చిన్ననాటి స్నేహితులందరూ అన్నారు. ఆదివారం మిత్రుడి కుటంబాన్ని పరామర్శించి, ఆయన మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఒక మంచి మిత్రుడిని కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో ఆర్థికంగా, మానసికంగా ధైర్యంగా నిలబడాలని ఆకాంక్షిస్తూ.. తమ బ్యాచ్ మిత్రుల తరఫున ఆయన కుటుంబ సభ్యులకు రూ.63,500/- ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నర్సింహులు కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని, భవిష్యత్తులో కూడా వారికి అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు ముందుంటామని 1991-92 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ స్నేహితులు హామీ ఇచ్చారు. నర్సింహులు ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ తీరని లోటు భరించే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -