- తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సిరిసిల్ల జిల్లా మూడో మహాసభలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ప్రసాద్ పిలుపు
నవతెలంగాణ-హైదరాబాద్: మూడోసారి అధికారంలోకి వచ్చిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులపై తీవ్ర దాడికి పాల్పడుతోందని, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో పూర్తిగా విఫలమైందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ప్రసాద్ ఆరోపించారు. సాగుభూములు, ఇండ్ల స్థలాలు, కనీస వేతనాల సాధన కోసం వ్యవసాయ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు.ఆదివారం సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార భవన్ లో జిల్లా వ్యవసాయ కార్మికసంఘ మూడో మహాసభ జిల్లా నాయకులు గురిజాల శ్రీధర్ అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ, వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటడంతో నిత్యావసర సరుకుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయని అన్నారు. ప్రజలపై పడుతు లకు విరుద్ధమని పేర్కొన్నారు. గ్రామీణ న్న ఆర్థిక భారం తగ్గించడంలో కేంద్ర ప్ర భుత్వం విఫలమైందని విమర్శించారు. యూపీఏ హయాంలో తీసుకొచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేదలకు ఉపాధి భద్రత కల్పించిందని, దానిని బలహీనపరిచే విధంగా మార్పు లు తీసుకురావడం ఆందోళన కలిగిస్తుందన్నారు.
ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ పేరుతో పౌరుల పౌరస త్వాన్ని నిర్ణయించే ప్రయత్నాలు జరుగు తున్నాయని, మతాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ది పొందే ప్రయ త్నాలు జరుగుతున్నాయని ఆరోపిం చా రు. విద్యుత్ సంస్కరణల చట్టం ద్వారా ఉచిత విద్యుత్కు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, కార్మిక హక్కులను దెబ్బతీసే విధంగా లేబర్ కోడ్స్మలవు తున్నాయని విమర్శించారు. వ్యవసా య కార్మికుల జీవన పరిస్థితులు రోజురో జుకూ దుర్భరంగా మారుతున్నాయని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనా లు పెరగడం లేదన్నారు. గ్రామీణ ప్రాం తాల్లో యాంత్రీకరణ పెరగడంతో ఉపాధి అవకాశాలు తగ్గి, వ్యవసాయ కూలీలు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో లో వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలైన భూమిలె ‘ని కార్మికులకు ఆర్థిక సహాయం, కౌలు రైతులకు మద్దతు, మహిళలకు ఆర్థిక భరోసా, పట్టణ పేదలకు ఉపాధి విస్తరణ, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశా లు, ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్ల పెంపు వంటి హామీలను ఇప్ప టికీ అమలు చేయలేదని విమర్శించారు.సాగుభూమి, కనీస వేతనాల సాధన కోసం వ్యవసాయ కార్మికులు ఉద్యమించాలన్నారు.
ఈ మహాసభ ప్రారంభ సూచకంగా అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ మహాసభలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గన్నేరం నర్సయ్య కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మూషం రమేష్, పెద్ద లింగాపూర్ గ్రామ సర్పంచ్ గన్నేరం వసంత, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆడెపు రజిత, జవ్వాజి విమల కేవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి నాగరాజు, బీడీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సూరం పద్మ శ్రీరాముల రమేష్ చంద్ర, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామంచ అశోక్, సిఐటియు జిల్లా నాయకులు అన్నల్ దాస్ గణేష్, ఎలిగేటి రాజశేఖర్ లు సౌహార్ధ సందేశం ఇచ్చారు. ఈ మహాసభలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బండ రవి మాధురి, మాధవి దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.\




