కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థికంగా లబ్ది

నవతెలంగాణ – తొగుట 
కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్దిపొందేందుకు బ్యాంకు ఖాతా తీసుకోవాలని ఎంపీడీవో శ్రీధర్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో వికాసత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీవో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం బ్యాంకు ఖాతా తీసుకోవడం ఎంతో అవసరం అన్నారు. బ్యాంకుల వల్ల ఉప యోగాలు, ఖాతాను ఎలా వాడాలి, కుటుంబ బడ్జెట్,
వ్యక్తి బడ్జెట్, బ్యాంక్ ఖాతా రకాల గురించి వివరించారు. ఈ -కె వైసి,నామినీ ప్రాముఖ్యత,భీమా రకాలు,పీఎం ఎసిబివై (ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన)పిఎంజెజె బివై (ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన) ఏపీవై (అటల్ పెన్షన్ యోజన) ఎస్ఎస్బీవై (సురక్ష సమృద్ధి బీమా యోజన) ఉజ్వల,ఆయుష్మాన భారత్, విష్వకర్మా యొజన పలు మొదలగు భీమా రకాలు,రుణాలు, రైతులు పంట రుణాలు,ముధ్రా రుణాలు,వ్యక్తిగత రుణాలు,డిజిటల్ లావాదేవీలు,రూపే ఎటిఎం కార్డ్ యుటిలిటీస్ గురించి చర్చించినట్లు తెలిపారు. వాటా,అంబుడస్మెన్ ప్రాముఖ్యత “రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా”ఆర్థిక అక్షరాస్యత శిబిరం యొక్క ప్రాముఖ్యత మొదలైన వాటి గురించి వివరించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండల్ రెడ్డి, ఎస్బిఐ బ్యాంకు మేనేజర్ ఫణి సార్, వైద్య అధికారి రాధకిషన్, ఆయుష్ డాక్టర్ సుభాషిని, హెల్త్ సూపర్వైజర్ శ్యామల,ఏఈఓ రాజేష్,పంచా యితీ కార్యదర్శి శ్యామల,ఉపసర్పంచ్ బాలరాజ్, వార్డు సభ్యులు,ఏఎన్ఎం లు,అంగనివాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు,తొగుట సిఎఫ్ఎల్ కో-ఆర్డి నేటర్ బి.స్వామి.ఎ.శ్రీనివాస్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love