- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఢిల్లీలోని కేంద్ర విద్యాశాఖ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. వికాస్‌మార్గ్‌లోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ భవనం రెండో అంతస్తులో ఈ ఉదయం మంటలు చెలరేగాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, అయితే పలు దస్త్రాలు కాలిపోయాయని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన అంతస్తులో విద్యాశాఖ కార్యాలయాలు, అధ్యాపకుల క్యాబిన్‌లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఏసీ నుంచి మంటలు చెలరేగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
- Advertisement -



