బ్యాంగిల్ స్టోర్ లో అగ్ని ప్రమాదం

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో టైలరింగ్, బ్యాంగిల్ స్టోర్ లో మంటలు చెలరేగిన సంఘటన  మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బస్టాండ్ ఎదురుగా ఉన్న గంగ రాజయ్య షాపుల్లో  విజయ గత కొన్ని నెలలుగా టైలరింగ్ బ్యాంగిల్స్ స్టోర్ నడుపుతోంది. ఈ క్రమంలో ఉదయం టైలరింగ్ షాప్ బ్యాంగిల్ స్టోర్ నుండిపొగలు రావడంతో వెంటనే బ్యాంగిల్ స్టోర్ యజమానికి ఫోన్ చేసి తెలపగా, షట్టర్ తాళం తీసి చూడగా మంటలు అంటుకున్నాయి. దీంతో వెంటనే స్థానికులు ఫైర్ స్టేషన్​కు ఫోన్ చేయగా ఫైర్ స్టేషన్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొని వచ్చి పూర్తిగా ఆర్పీవేశారు. దాదాపు రూ.50 వేలకు పైగా నష్టం వాటిల్లిందని యజమాని విజయ తెలిపారు.
Spread the love