Sunday, June 7, 2026
E-PAPER
Homeక్రైమ్చిన్నకోడూరులో అగ్ని ప్రమాదం

చిన్నకోడూరులో అగ్ని ప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ – చిన్నకోడూరు 
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లపూర్‌ గ్రామంలో అదివారం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు గుడికందుల మధుకు చెందిన 5 ఎకరాల వరి కట్టలు, ఒక ట్రాక్టర్, అలాగే ఏడాది వయసున్న ఒక చిన్న దూడ మంటల్లో కాలి బూడిదయ్యాయి. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల వారు ఫైర్ స్టేషన్  సమాచారం అందించారు.  సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో తనకు సుమారు 1.50 లక్షల నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. బాధిత రైతును ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సర్పంచ్ సురగొని శేఖర్ కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -