- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. జలమండలి యూనియన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్‌టీయూసీ జెండా ఎగరడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. 800 ఓట్ల భారీ మెజారిటీతో అధ్యక్షుడిగా గెలిచిన రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర రాజులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కార్మికులకు ఉన్న నమ్మకానికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు. ఇక రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీదే గెలుపు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
- Advertisement -



