- Advertisement -
యువకుడు మృతి
ఇంఫాల్ : మణిపూర్‌లో మళ్లీ కాల్పులు చెలరేగాయి. తమంగ్‌లాండ్ జిల్లాలో అనుమానిత ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక యువకుడు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఎన్.కె.విఫెన్‌బో అనే నాగా యువకుడు అప్పర్‌న్కో నుంచి టమేయి పట్టణానికి వెళ్తుండగా ఉగ్రవాదులు దాడి చేశారని అన్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ఈ దాడి జరిగింది. రహదారి పక్కన పడి ఉన్న అతని మృతదేహాన్ని నాగా వాలంటీర్లు గుర్తించారని అన్నారు.
- Advertisement -



