Tuesday, May 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుగుంటూరు జిల్లాలో కాల్పులు...

గుంటూరు జిల్లాలో కాల్పులు…

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆలూరు రైల్వే గేట్‌ సమీపంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. రైల్వే ట్రాక్‌ వెంట కట్టర్లు పట్టుకుని తిరుగుతున్న కొంతమంది దుండగులను జీఆర్పీ పోలీసులు గుర్తించారు. పోలీసులను చూసి వారు రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా.. వారు పరారయ్యారు. రైళ్లలో దోపిడీల నియంత్రణకు గస్తీ నిర్వహిస్తుండగా మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పొన్నూరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -