సమస్యలే లేని విధంగా ముంపు గ్రామాలను తీర్చిదిద్దుతా..

– యువతకు ఉపాధి కొరకు మంత్రి కేటీఆర్ కృషి..
– వేములవాడ, కథలాపూర్, భీమావరం మండలాలకు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ లో చేరిక..
– బీఆర్‌ఎస్‌ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు. 
నవతెలంగాణ – వేములవాడ:
సమస్యలే లేని విధంగా మిడ్ మానేర్ ముంపు గ్రామాలను తీర్చిదిద్దుతానని, బీఆర్‌ఎస్‌ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు అన్నారు. గడపగడపకు గులాబీ జెండా కార్యక్రమంలో భాగంగా బుధవారం వేములవాడ అర్బన్ మండలంలోని ఆరెపల్లి, సంకేపల్లి, రుద్రవరం ఆర్ అండ్ ఆర్ కాలనీలో జడ్పీ చైర్ పర్సన్ అరుణ-రాఘవ రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి చల్మెడ మాట్లాడారు. ముంపు గ్రామాలతో తనకు విడదీయలేని అనుబంధం ఉందని, ముంపు గ్రామాల ప్రజల కడుపులోని ఆవేదన అర్థమవుతుందని, డ్యామ్ నిర్మాణం పూర్తయి ఏండ్లు గడుస్తున్నా సమస్యలు పరిష్కారం కాకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కు గుండె కాయ వంటి మిడ్ మానేరు జలాశయంతో లక్షలాది ఎకరాలకు సాగునీరు, చాలా గ్రామాలకు త్రాగు నీరు అందుతుందని, అలాంటి నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు. గ్రామాలు కోల్పోవడంతో ఉపాధి కోల్పోయిన యువత కొరకు మంత్రి కేటీఆర్ పాత చీర్లవంచ, చింతల్ ఠాణాల్లో రూ.600కోట్లతో అమెరికా సాయంతో చేపల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తున్నారని, దీంతో సుమారు 6వేల మందికి ఉపాధి అవకాశం కలుగుతుందని,  రాబోయే రోజుల్లోనూ యువతకు మరింత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీడీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  అభివృద్ధి చేయాలని ఆశయంతో ప్రజల కష్టాల్లో పాలుపంచుకొని, సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వస్తున్నానని, ఈ క్రమంలో సంకేపల్లి గ్రామంలో ఇటీవలే 45మంది ఇండ్ల పట్టాలు రావడానికి కృషి చేశానని, ముంపు గ్రామాల సమస్యల పరిష్కారానికై ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, సంబంధిత అధికారులతో మాట్లాడటం జరుగుతుందని, ఇప్పటికే రూ.14కోట్లు వచ్చి ఉన్నాయని, మరో రూ.28కోట్లు కేటాయిస్తే ముంపు గ్రామాల్లోని సమస్యలన్నీ పరిష్కారమవుతాయని తెలిపారు. కాంగ్రెస్ కు ఓటేస్తే మళ్లీ చీకటి రోజులు వస్తాయని, రాష్ట్రంలో రక్తపాతం మొదలవుతుందని, రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలన్న, ప్రజల బ్రతుకులు మారాలన్న సీఎం కేసీఆర్ ను  మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని, సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు వస్తున్న తనకు  ఒక్కసారి అవకాశం ఇస్తే  ముంపు గ్రామాల సమస్యలను మొదటి ప్రాధాన్యతగా తీసుకొని ఏడాదిలోపు సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మ్యాకల రవి, ఎంపీపీ బూర వజ్రమ్మ-బాబు,
వైస్ ఎంపిపి ఆర్.సి రావు, సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి, సర్పంచ్ లు ఇటిక్యాల నవీన- రాజు, జింక సునీత, ఊరడి రామ్ రెడ్డి, వెంకట రమణారావు, రేగులపాటి రాణి, రంగు సత్తెమ్మ-రాములు, ఎంపిటిసిలు వనపర్తి దేవరాజ్, గాలిపల్లి సువర్ణ-స్వామి గౌడ్, సెస్ డైరెక్టర్ హరి చరణ్ రావు, ప్యాక్స్ చైర్మన్లు రేగులపాటి కృష్ణ దేవరావు, తిరుపతి రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఊరడి ప్రవీణ్,  నాయకులు   సిలువేరి మల్లేశం, మెడికల్ రాజిరెడ్డి,  కాసర్ల అరుణ్,  నరేష్ పటేల్, రాము, పర్శరాములు, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వేములవాడ,కథలాపూర్, భీమావరం, మండలాలకు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ లో చేరిక..
వేములవాడ రూరల్ మండలంలోని భారతీయ జనతా పార్టీకి చెందిన రూరల్ మండలం ఎస్సీ మోర్చా అధ్యక్షులు లక్కే కృష్ణ, మాజీ ఉపసర్పంచ్ లింగంపల్లి శంకరయ్య, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు లింగంపల్లి హనుమంతు, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు ఎండపల్లి రాజయ్య, తో పాటు సుమారు 40 మంది యువకులు, కథలాపూర్ మండలం  చింతలకుంట గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ల సంఘం సభ్యులు 30 మంది, భీమవరం మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన అంబేద్కర్ సంఘ సభ్యులు బీఆర్‌ఎస్‌ పార్టీలో చల్మెడ  లక్ష్మీ నరసింహ రావు సమక్షంలో పార్టీలో చేరారు.చల్మెడ నివాసంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో వీరంతా జిల్లా జడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీనారాయణ సమక్షంలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండ మల్లేష్ యాదవ్, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు యేషా తిరుపతి, జడ్పిటిసి నాగం భూమయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాల్రెడ్డి, గడ్డం హనుమాన్లు, మాజీ సర్పంచ్ అంగడి ఆనంద్ కుమార్,  మారుపాక బక్కయ్య, శ్రీకాంత్, గంగాధర్, సతీష్, నరసయ్య, దళిత సంఘాల నాయకులు బంగారు, దీపక్ కుమార్, మల్లారం తిరుపతి, చంద్రగిరి అంజయ్య, ఎండపల్లి విష్ణు తో పాటు తదితరులు పాల్గొన్నారు
Spread the love