ఫుడ్‌ పార్కింగ్‌ స్థలాలు హాంఫట్‌..!

సర్వే నెంబర్‌ 813లోని ప్రభుత్వ భూమిలో రియల్టర్ల పాగా
కోట్లల్లో బేరసారాలు.. మ్యాపుల్లోనే ప్లాట్‌ల అమ్మకాలు..
రోడ్డు కోసం పేదల గుడిసెలను తొలగించేందుకు అడ్డదారులు..
తూతూ మంత్రంగా అధికారుల చర్యలు
నవతెలంగాణ-నర్సంపేట
ఫుడ్‌ పార్కింగ్‌ పరిశ్రమలు నెలకొల్పేందుకు కేటాయించడానికి సిద్ధం చేసిన ప్రభుత్వ భూములను రియల్టర్లు మాయం చేసేందుకు పావులు కదుపుతున్నారు. వెంచర్‌ రోడ్డుకు పేదల గుడిసెలు అడ్డుగా ఉన్నాయని వాటిని తొలగించేందుకు రియల్టర్లు అడ్డదారులు తొక్కుతున్నారు. పోలీసు, రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని గుడిసెవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్‌ ప్రాసెస్‌ యూనిట్‌లను ఏర్పాటు చేసి ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి చేస్తున్న ప్రయ త్నాలకు, ఆ పార్టీలో రియల్టర్ల ముసుగులోని కొందరు నాయకులు గండికొడు తున్నారని విమర్శలు వెలువడుతున్నాయి. కొన్నాండ్ల క్రితం ఫుడ్‌ పార్కింగ్‌ ఏర్పా టు కోసం ఎమ్మెల్యే చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సానుకూలంగా స్పందించి భూసేకరణ కో సం రెవెన్యూ శాఖకు ఉత్వర్వులు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర మౌళిక సదు పాయాల సంస్థకు పట్టణంలోని నెక్కొండ రోడ్డు కాకతీయ నగర్‌ సమీపంలో సర్వే నెంబర్‌ 813లోని 80ఎకరాల్లో తొలుత 40 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిం చడానికి ప్రతిపాదన నివేదించారు. ఈ ప్రక్రియ ఒక వైపు కొనసాగుతుండగా మరోవైపు రియల్టర్లు ప్రభుత్వ భూముల్లో చొరబడి అక్రమంగా కైవసం చేసుకొనేం దుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందుకోసం ఇటీవల అధికార పార్టీకి చెందిన కొందరు రియల్టర్లు దీని పక్కనే ఉన్న పట్టా భూములను కొనుగోలు చేశారు. మ్యాప్‌ల్లోనే ప్లాట్‌లను పేర్కొంటూ అమ్మకాలకు పూనుకున్నారు. ఇలా యధేచ్ఛగా ఫుడ్‌ పార్కింగ్‌ ప్రతిపాదిత స్థలాలు అన్యాక్రాంతమవుతున్నా రెవెన్యూ అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టకపోవడం శోచనీయం. ఆందోళనలతో ఇటీవల నెక్కొం డ రోడ్డు పక్కన రియల్టర్‌లు పాతిన పలు చోట్ల హద్దు రాళ్లను తాత్కాలికంగా తొలగించారు. ప్రభుత్వ భూములను రక్షించడానికి శాశ్వత చర్యలు చేపట్టాలని సీపీఐ(ఎం) నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.
గుడిసెలను తొలగించడానికి ప్రయత్నిస్తే సహించేది లేదని పోరాటాలతో అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం భూములని కాజేసేందుకు జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్యే చొరవ చూపాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.
గుడిసెలను తొలగించడానికి రియల్టర్ల పావులు..!
పట్టణంలోని కాకతీయ నగర్‌ సర్వే నెంబర్‌ 601/1/లో 1.39 ఎకరాల ప్రభు త్వ భూమిలో రెండున్నరేండ్ల క్రితం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పేదలు గుడిసెలు వే సుకొని జీవనం సాగిస్తున్నారు. ఓ భూ కబ్జాదారుడు కొన్నేండ్లుగా ఈ భూమిని ఆక్రమించుకొని ఏకంగా రియల్టర్‌లకు అమ్మేశాడు. నర్సంపేట-నెక్కొండ ప్రధాన రహదారి పక్కనే ఉన్న భూములు ఎకరాకు కోట్లల్లో ధర పలుకుతున్నాయి. ఈ ఆక్రమణనుఅడ్డుకొని సీపీఐ(ఎం) గుడిసెలు వేసి పేదలకు నీడనిచ్చింది. పేదలను ఖాళీ చేయడానికి పోలీసులను ప్రయోగించినా ఫలితం లేకుండా పోయింది. రౌడీ మూకలను ఉసిగొల్పి దాడులు సృష్టించినా పేదలు ఎదుర్కొని తిరగబడి గుడిసెలను కాపాడుకున్నారు.
ఇటీవల ఈ భూమి సమీపంలో కొందరు అధికార పార్టీకి చెందిన రియల్టర్లు 2.28 ఎకరాల పట్టా భూమిని కొనుగోలు చేసి వెంచర్‌కు సిద్ధం చేశారు. ఆ పక్కనే ఉన్న 813 సర్వే నెంబర్‌లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించేసి వెంచర్‌లో కలు పుకునే ప్రయత్నం చేశారు. రెవెన్యూ అధికారులు హద్దు రాళ్లను తొలగించేశారు. అయినా వదలకుండా ఈ వెంచర్‌కు రోడ్డు కోసం ప్రధాన రహదారి పక్కనే ఉన్న పేదల గుడిసెలను తొలగించడానికి పావులు కదుపుతున్నారు. పోలీసులు అర్ధరా త్రి గుడిసెలను ఖాళీ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు. వీరితో భూకబ్జాదారులు, రియల్టర్‌లు ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పేదల గుడిసెల జోలికొస్తే తిరుగుబాటు తప్పదు : హన్మకొండ శ్రీధర్‌, సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి, నర్సంపేట
ప్రభుత్వ భూమిలోకొన్నేండ్లుగా గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. భూకబ్జా దారుడు ప్రభుత్వ భూమిని రియల్టర్‌లకు అమ్ముకోవ డాన్ని సీపీఐ(ఎం)అడ్డుకొంది.
పేదలు తలదాచుకొ నేందుకు గుడిసెలు వేసుకొని రక్షించారు. రెండున్న రేండ్లుగా జీవనంసాగిస్తూ వస్తున్నారు.
కొందరు రి యల్టర్‌లు తమ వెంచర్‌కు దారి కోసం పేదల గుడిసెలను ఖాళీ చేసే కుట్రలకు దిగారు.
పక్కనే ఉన్న ఫుడ్‌ పార్కింగ్‌ కేటాయించిన స్థలం కూడా ఆక్రమించేశారు.
అధికారులు చర్యలు చేపట్ట కుండా వారికి కొమ్ముకాయడం సరైంది కాదు.
గుడి సెల ను ఖాళీ చేయించే చర్యలు మానుకొని ఫుడ్‌ పార్కింగ్‌ స్థలాన్ని కాపాడాలి. జిల్లా కలెక్టర్‌ వెంటనే స్పందించాలి. లేకపోతే పోరాటాలతో అడ్డుకోవాల్సి ఉంటుంది.

Spread the love