ఫ్రెషర్స్ డే వేడుకలకు

నవతెలంగాణ-ధర్మసాగర్: చదువుతోనే సమస్తము సాధ్యమని జిల్లా ఇంటర్ విద్యాధికారి అజ్మీరా గోపాల్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లో జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. అతి తక్కువ కాలంలో కళాశాల సౌకర్యాల కల్పన, విద్యార్థులు వికాసం కోసం ప్రిన్సిపాల్ అస్నాల శ్రీనివాస్ చేస్తున్న కృషి రాష్ట్ర వ్యాప్తంగా ప్రేరణగా నిలుస్తుందని అన్నారు.శక్తి సామర్ధ్యాలు ఉన్న విద్యార్ధి యువతరం కాలంతో పోటీపడి జ్ఞాన సముపార్జన చెయాలని అన్నారు. ప్రిన్సిపాల్ ఆస్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ చదువుతోనే జ్ణానం సంపద పురోగతి కలుగుతాయని అన్నారు. ఈ స్పృహతో రెగ్యులర్ అధ్యాపకులు అదనంగా పని చేస్తూ, కళాశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను, ఉచిత స్టడీ మెటీరియల్ ను అందిస్తున్నారని అన్నారు.ఇంటర్ తో పాటు ఉన్నత విద్య అవకాశాల పై అవగాహనను కల్పిస్తున్నామని ఆరోపించారు. ఉన్నత విద్యలో చేరే వరకు వారికి సహకరిస్తామన్నారు సహకారం అందిస్తున్నామని తెలిపారు.విశిష్ట అతిధులుగా పాల్గొన్న ప్రధానోపాధ్యాయులు డా రాం ధన్,జ్ఞాన సుందరి,వేణుగోపాల్ లు మాట్లాడుతూ సృజనాత్మక , సామాజిక భాద్యత గల పౌరులు ప్రభుత్వ విద్యా సంస్థల నుండే ఏర్పడుతారని అన్నారు.సమాజాన్ని ముందుకు తీసుకపోవడానికి ఎదో ఒక రంగంలో నైపుణ్యం ఏర్పర్చుకోవాలని కోరారు.విద్యార్థుల గానాలు నృత్యాగేయాలు అభినయ నాటిక లతో  జరిగిన సాంస్కృతిక విభావరితో అలరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు యన్ యస్ యస్ అధికారి జ్యోతి, అధ్యాపకులు కనకయ్య , కరుణాకర్, బాబురావు, సదానందం, రాములు, మంజుల, ప్రభాకర్, అజమ్,  గణేష్, శ్రీకాంత్ లతో పాటు 200 ల మంది విద్యార్థులు పాల్గొన్నారు
Spread the love