కట్టమైసమ్మ దేవతను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే మెచ్చా

– స్వాగతం పలికిన జెడ్పీటీసీ వరలక్ష్మి కుటుంబం
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలంలోని  నారాయణపురం కట్ట మైసమ్మ దేవాలయాన్ని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆదివార  సందర్శించారు.గత నాలుగు రోజులుగా జరుగుతున్న కట్ట మైసమ్మ తల్లి అమ్మ వారి జాతర మహోత్సవం చివరి రోజు ఆయన హాజరైన సందర్భంగా జెడ్పీటీసీ సభ్యురాలు చిన్నం శెట్టి వరలక్ష్మీ నరసింహం దంపతులు మెచ్చా ను సాదరంగా ఆహ్వానించి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.ఆలయ కమిటీ సభ్యులు మెచ్చా ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్  మండల ప్రధాన కార్యదర్శి జుజ్జూరి వెంకన్న బాబు,నాయకులు మోహన్ రెడ్డి,జక్కుల రాంబాబు,చంద లక్ష్మి నర్సయ్య,చందా కుమార్ స్వామి,తాళ్ళాడ వెంకటేశ్వరరావు,లకావత్ వెంకటేశ్వరరావు,వనపర్తి మహేశ్వరరావు,భూక్యా గాంధీ తదితరులు ఉన్నారు
Spread the love