ట్రాక్టర్ బోల్తా మాజీ సర్పంచ్ మృతి

– రోడ్ పై వడ్ల కోసం పెట్టిన రాయిని  తప్పించ బోయి ట్రాక్టర్ బోల్తా మాజీ సర్పంచ్ మృతి
నవ తెలంగాణ-చందుర్తి:  రోడ్ పై వడ్లను అరబెట్టగా వాటి పక్కన ఉన్న  రాయిని తప్పించ బోయి ట్రాక్టర్  బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో మాజీ సర్పంచ్ మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి  మండల కేంద్రంలో చోటు చేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.గ్రామానికి చెందిన మర్రి మల్లేశం (55)తన వ్యక్తిగత పనుల కోసం సొంత ట్రాక్టర్ డ్రైవింగ్ చేసుకుంటూ మోత్కురావుపేట రోడ్ వైపుగా వెళ్ళుతున్నాడు.ఈ క్రమంలో రైతు వేదిక వద్ద వరి ధాన్యం ను రైతులు అరబెట్టగా వాటి పక్కన ఉన్న రాయిని పెట్టారు.ఆ రాయిని తప్పించగా ట్రాక్టర్ బోల్తా కొట్టి రోడ్ పక్క కు దూసుకెళ్లి బోల్తాకొట్టింది.ఈ ఘటనలో మల్లేశం కు తీవ్ర గాయాలు కాగా చికిత్స నికిత్తం వేములవాడ ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లుగా బంధువులు, గ్రామస్తులు తెలిపారు.
2004 గ్రామ సర్పంచ్ గా తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించినాడు. 2004 సంవత్సరంలో మర్రి మల్లేశం చందుర్తి గ్రామ సర్పంచ్ గా ఐదు సంవత్సరాలుగా సేవలందించినాడు. మల్లేశం మృతితో గ్రామస్తులు, పలువురు ప్రజా ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.
Spread the love