అప్పుల ఊబిలోకి మాజీ సర్పంచ్ లు..

– బిల్లులు రాక అనేక అవస్థలు..
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్

సర్పంచ్ కావాలని ఇష్టంతో ఎన్నికైన సర్పంచుల పదవీకాలం ముయ్యటంతో మళ్లీ కొత్త సర్పంచులు ఎప్పుడు అవుతారు ఎవరికి తెలియదు సర్పంచులు కష్టపడి ప్రజాప్రతినిధుల అధికారుల ఆదేశానుసారం అప్పులు చేసి గ్రామాలను అభివ ద్ధి చేశారు. నేటి వరకు బిల్లులు రాకపోవడంతో కొంతమంది సర్పంచులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పెద్దకొడప్ గల్ మండల పరిధిలోని 25 గ్రామపంచాయతీలలో కేవలం కొన్ని గ్రామపంచాయతీలకు మాత్రమే నిధులు వస్తున్నాయి. పరిశ్రమల నుండి టాక్స్లు మిగతా గ్రామపంచాయతీలకు సోర్స్‌ లేకపోవడంతో ఆ సర్పంచులు చేసిన పనులు బిల్లులు రికార్డులు చేయడంతో తీరా ప్రభుత్వం చెక్కులను రిజెక్ట్‌ చేయటంతో మాజీ సర్పంచులు అయో మయంలో పడ్డారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలు.అసెంబ్లీ ఎన్నికలు. పార్లమెంట్‌ ఎన్నికలు ఇలా ఎన్నికల కోడ్లు రావడంతో చెక్కులు, చెల్లుబాటు కాకపోవటంతో మాజీ సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఏదైనా సమస్య అడగాలంటే గ్రామ కార్యదర్శిని సంప్రదించాల్సి వస్తుంది. గ్రామ కార్యదర్శి త్రాగునీరు, విద్యుత్‌ దీపాలు తప్ప తాను ఏమి చేయలేకపోతున్నారు. గ్రామాలలో చిన్నచిన్న తగాదాలు జరుగుతున్నప్పటికీ ఎవరికి వారే యమునా తీరే అంటూ మాజీ సర్పంచులే పంచాయతీల తీర్పు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా గత ప్రభుత్వం పాత సర్పంచులకు10 సంవత్సరాలు రిజర్వేషన్‌ ఖరారు చేసింది. ఈ ప్రభుత్వం ఆ రిజర్వేషన్ను మారుస్తుందా యధావిధిగా కొనసాగుతుందా అర్థం కాని పరిస్థితిలో సర్పంచులు చర్చించుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ప్రస్తుతం టీజీగా మార్చడంతో అలా రిజర్వేషన్‌ కూడా మారుస్తారా అనే సంక్షిప్తంలో మాజీ సర్పంచులు ఎంపీటీసీలు,జడ్పీటీసీలువార్డు సభ్యులు చర్చిస్తున్నారు.

Spread the love