బొల్లెపల్లిలో ప్రచారం నిర్వహించిన మాజీ వైస్ ఎంపీపీ  శ్రీనివాస్ గౌడ్..

నవతెలంగాణ –  భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలం బొల్లేపల్లి గ్రామంలో భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ భువనగిరి మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రచారము నిర్వహించి, ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఆరు గ్యారెంటీ పథకాలను వారికి వివరించారు. కాంగ్రెస్ పార్టీతోనే పేదల అభివృద్ధి సాధ్యమని, కాంగ్రెస్ అభ్యర్థి చాముల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కనకుంట్ల  బాబూరావు, జిట్టా కృష్ణారెడ్డి ముక్కిడి బాలయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు హరిశంకర్ గుండు కృష్ణ ఉదయ్, శంకరయ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Spread the love