ఘోర రైలు ప్రమాదం.. నలుగురు మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: బెంగాల్ న్యూజలపాయ్ గురిలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కాంచనగంగ ఎక్స్ ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీకొట్టింది. రంగపాని స్టేషన్ నుంచి ట్రైన్ సిలుగురి దాటిన కాసేపటికి ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ రైలు ప్రమాదంలో పలువురికి గాయాలు అయినట్లు తెలిసింది. క్షతగాత్రులను హుటాహుటిన అధికారులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love