మెదక్ లో ఘోర రోడ్డుప్రమాదం… నలుగురు మృతి

నవతెలంగాణ – మెదక్‌: రెండు లారీలు ఢీకొని నలుగురు మృతి చెందారు. ఈ సంఘటన మెదక్‌ జిల్లా చేగుంట మండలం వడియారం వద్ద బైపాస్‌రోడ్డుపై జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనక నుంచి వస్తున్న మరో లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వెనక లారీలో క్యాబిన్‌లో కూర్చున్న నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Spread the love